శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆదివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. కేబినెట్ మంత్రులందరూ మంత్రివర్గానికి రాజీనామా చేశారు. అనంతరం శ్రీలంక ప్రధానికి పత్రాలు అందజేశారు. ఇటీవల పెరిగిన ధరలు, నిత్యవసరాల కొరత, విద్యుత్ కోతలతో ప్రజలు గత కొన్నిరోజులుగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో అధ్యక్ష స్థానం నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజలు అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టారు. దీంతో తీవ్ర హింస చెలరేగింది. పలువురు గాయపడ్డారు. దీంతో అధ్యక్షుడు ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స కుమారుడు నమల్ రాజపక్స కూడా అన్ని పదవులకు రాజీనామా చేశారు. దీంతో ప్రధాని నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.