ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 04, 2022, 08:24 AM

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి సోమవారం నుంచి కలెక్టరేట్లను నోటిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టరేట్లు నోటిఫై చేసిన చోట్ల నుంచే పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సీసీఎల్‌ఏ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
శ్రీకాకుళం కలెక్టరేట్ - కొత్తపేట జంక్షన్‌
విజయనగరం కలెక్టరేట్ - కంటోన్‌మెంట్‌
విశాఖ కలెక్టరేట్ - మహారాణిపేట
మన్యం జిల్లా కలెక్టరేట్‌- పార్వతీపురం గిరిజన సంక్షేమ భవనం
అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ - శంకరం గ్రామ పంచాయతీ
అల్లూరి సీతారామరాజు కలెక్టరేట్‌ - పాడేరు
కాకినాడ జిల్లా కలెక్టరేట్‌ - పాత కాకినాడ కలెక్టరేట్
కోనసీమ జిల్లా కలెక్టరేట్‌ - అమలాపురం
తూ.గో. కలెక్టరేట్ - రాజమహేంద్రవరం
ఏలూరు కలెక్టరేట్ - ఏలూరులోని పాత కలెక్టర్ భవనం
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ - భీమవరం లోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాల భవనం
కృష్ణా జిల్లా కలెక్టరేట్ - మచిలీపట్నంలోని పాత కలెక్టరేట్ భవనం
ఎన్టీఆర్ జిల్లా - విజయవాడలోని సబ్ కలెక్టరేట్ కార్యాలయం
గుంటూరు జిల్లా కలెక్టరేట్ - గుంటూరులోని నగరంపాలెం కలెక్టర్ కార్యాలయం
బాపట్ల జిల్లా కలెక్టరేట్ - బాపట్లలోని మానవవనరుల అభివృద్ధి కేంద్రం భవనం
పలనాడు జిల్లా కలెక్టరేట్ - నరసరావుపేట లోని జలవనరుల శాఖ కార్యాలయ భవనం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa