ఏపీలో కొత్త జిల్లాలను సీఎం జగన్ సోమవారం ఉదయం వర్చువల్ గా ప్రారంభించారు. పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలుగా ఏర్పడ్డాయి. రెవెన్యూ డివిజన్లు 51 నుంచి 72 పెరిగాయి. దీంతో ఇకపై ఏపీ రాష్ట్రంలో 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు ఉండనున్నాయి. నేటి నుంచి రాష్ట్రంలో 26 జిల్లాల నుంచి పాలన సాగనుంది. 43 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో 13 కొత్త జిల్లాలు అవతరించాయి.