ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వింగ్‌ అయ్యే బంతులను రుతురాజ్ గైక్వాడ్ ఆడలేడు: వసీం జాఫర్

sports |  Suryaa Desk  | Published : Mon, Apr 04, 2022, 12:20 PM

IPL 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పరాజయాల పరంపరను కొనసాగిస్తోంది. సోమవారం పంజాబ్ కింగ్స్ చేతిలో చెన్నై 54 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఎన్నో అంచనాల నడుమ బరిలోకి దిగిన డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై.. వరుసగా మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ముఖ్యంగా స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వైఫల్యం జట్టుకు కోలుకోలేని నష్టం చేస్తుంది.


గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన లీగ్ ద్వితీయార్థంలో గైక్వాడ్ దుమ్ము రేపాడు. ఈసారి మూడు మ్యాచ్‌ల్లోనూ (0, 1, 1) విఫలమయ్యాడు. అయితే రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్‌లో ఇబ్బంది పడ్డాడని, స్వింగ్ బంతులు ఆడలేడని టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ వసీం జాఫర్ అన్నాడు. గైక్వాడ్ మంచి ఆటగాడు అయితే తన తప్పులను సరిదిద్దుకునే మార్గాన్ని వెతకాలి. దాంతో మళ్లీ రాణించి చెన్నైని విజయపథంలో నడిపించాలి’’ అని జాఫర్ సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa