ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిల్లాడి పై కానిస్టేబుల్ దాడి

national |  Suryaa Desk  | Published : Mon, Apr 04, 2022, 12:27 PM

ఒక పిల్లాడిని కానిస్టేబుల్ దారుణంగా కొట్టిన ఘటన.. గుజరాత్ లోని వడోదరలో చోటు చేసుకుంది. వడోదర ఛని పోలీస్ స్టేషన్ లో... కానిస్టేబుల్ శక్తిసిన్హ్ పవరా పోలీసు వాహన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వడోదరలోని నందసరి ప్రాంతంలో.. శక్తిసిన్హ్ పోలీసు వాహనం నడుపుతున్న సమయంలో రోడ్డుదాటుతున్న 13 ఏళ్ల బాలుడు అడ్డువచ్చాడు. శక్తిసిన్హ్ బ్రేక్ వేయగా బాలుడు రోడ్డు పక్కనే ఉన్న దుకాణంలో ఏదో కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. వాహనం దిగిన కానిస్టేబుల్ దుకాణంలోకి వెళ్లి బాలుడిని కొట్టుకుంటూ బయటికి తీసుకొచ్చాడు. బాలుడు భయంతో పక్కఉన్న మరో దుకాణంలోకి పరిగెత్తగా కానిస్టేబుల్ వెంబడించి మరీ కొట్టాడు. స్థానికులు సర్ధిచెప్పడంతో కానిస్టేబుల్ పిల్లాడిని వదిలేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. ఈ ఘటన జరిగిన 24 గంటలకే బాలికతో అనుచితంగా ప్రవర్తించినందుకు కానిస్టేబుల్ శక్తిసిన్హ్ పవరాను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. బాలుడి వ్యవహారంపై... దర్యాప్తునకు ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa