ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవకాశమున్న ప్రతివేదికపై రష్యా తీరును ఖండిస్తున్న జెలెన్ స్కీ

international |  Suryaa Desk  | Published : Mon, Apr 04, 2022, 12:30 PM

రష్యా చేస్తున్న దండయాత్ర తమ పౌరుల కలలను, ప్రాణాలను చిదిమేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ ఆవేదన వ్యక్తంచేశారు. అవకాశమున్న ప్రతివేదికపై రష్యా తీరును ఖండిస్తున్న ఆయన.. అమెరికా లాస్ వెగాస్ లో జరుగుతున్న గ్రామీ అవార్డుల వేదికపైనా.... పుతిన్ తీరుపై ధ్వజమెత్తారు. ఈ మేరకు ప్రత్యేక వీడియో సందేశం ఇచ్చారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో తాండవిస్తున్న నిశ్శబ్దాన్ని  మీ సంగీతంతో చేధించాలని గ్రామీకి వచ్చిన కళాకారులను జెలెన్ స్కీ కోరారు. సూట్లు ధరించి సంగీతం వినిపించాల్సిన ఉక్రెయిన్ కళాకారులు యుద్ధ కవచాలను ధరిస్తున్నారని వాపోయారు. ఆలకించేవారు లేకున్నా ఆసుపత్రుల్లో క్షతగాత్రుల కోసం పాడుతున్నారని పేర్కొన్నారు. సంగీతం ఎలాంటి సమస్యైనా పరిష్కరిస్తుందన్న జెలెన్ స్కీ..... గ్రామీలో పాల్గొన్న సంగీతకారులు అంతా టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో ఉక్రెయిన్ కు అండగా నిలవాలని కోరారు. కళాకారులు ఏదో ఒక విధంగా తమ కథను ప్రపంచానికి వినిపించాలని, మౌనం వహించవద్దని జెలెన్ స్కీ కోరారు..


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa