అమరావతి ప్రాముఖ్యతను తెలిపేలా ఏపీలో పదో తరగతి తెలుగు పుస్తకంలో రూపొందించిన పాఠాన్ని అధికారులు సిలబస్ నుంచి తొలగించారు. తెలుగు పుస్తకంలో రెండో పాఠంగా అమరావతిని గత ప్రభుత్వ హయాంలో ముద్రించారు. ప్రస్తుత ప్రభుత్వం 3 రాజధానులను తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు అమరావతి పాఠాన్ని ఈ ఏడాది సిలబస్ నుంచి తొలగించారు. ఈ విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనందున విద్యార్థులపై భారం పడకూడదని వివిధ సబ్జెక్టుల్లో కొన్ని పాఠాలను తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. సిలబస్ భారం తగ్గించాలంటే పుస్తకం చివర్లోని పాఠాలను తొలగించే వీలుండగా కావాలనే అమరావతిని తీసివేశారని పలువురు అంటున్నారు. టెన్త్ విద్యార్థులకు ఈ నెల 4 నుంచి ప్రీ పబ్లిక్ పరీక్షలు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి, వెన్నెల పాఠాలు మినహాయించి మిగిలినవి చదువుకుని పరీక్షలకు సిద్ధం కావాలని టీచర్లు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa