మైలవరం మండల పరిధిలో ఓ మహిళపై ఓ యవకుడు బీరు సీసాతో దాడి చేశాడు. దీంతో ఆమెకు గాయలయ్యాయి. మైలవరం ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు దొడియం గ్రామానికి చెందిన నారాయణమ్మ అక్క కుతురును ఆదే గ్రామానికి చెందిన జగదీష్ కు ఇచ్చి వివాహం చేశారు. కొన్నాళ్లకు జగదీష్, అయన అత్తకు ఈ మధ్య మనస్పర్థలు రావడంతో వారు మాట్లాడుకోవడం లేదు. ఈ క్రమంలో యాడికి నుంచి వద్దిరాలలో జరిగిన తిరునాలకు జగదీష్ అత్తవాళ్లు వచ్చారు. అక్కడి నుంచి దొడియంలో ఉన్న నారాయణమ్మ ఇంటికి రాగా విషయం తెలుసుకున్న జగదీష్ తమ్ముడు హరితో కలిసి అక్కడి వెళ్లాడు. వాళ్లను ఎందుకు పిలిచారంటూ నారాయణమ్మ తలపై ఖాళీ బీరుసీసాతో దాడి చేయగా ఆమెకు గాయలయ్యాయి. అడ్డుకోబోయిన లక్ష్మీనారాయణపై కూడా దాడి చేశారని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa