మహిళలకు పెదవులు మరింత అందాన్ని తీసుకొస్తాయి. అందమైన పెదవుల కోసం నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- తేనెలో పంచదార కలిపి పెదవులకు రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తే పెదవులపై ఉన్న మురికి తొలగిపోతుంది.
- ఆలూ ముక్కలతో పెదవులపై 10 నిమిషాలపాటు మర్దన చేసుకోవాలి. ఇలా చేస్తే పెదవులు గులాబీ రంగులోకి మారుతాయి.
- కలబంద గుజ్జును పెదవులకు అప్లై చేస్తే పెదవులు పొడిబారడాన్ని తగ్గిస్తుంది.
- టమాటా, పెరుగు మిశ్రమాన్ని 5 నిమిషాలపాటు పెదాలపై మర్దన చేయాలి.
- కుంకుమ పువ్వు, పెరుగును కలిపి పెదాలకు రాసుకోవాలి. ఇలా చేస్తే పెదవులు మృదువుగా మారుతాయి.
- గులాబీ రేకులను పాలల్లో కలిపి ఆ పేస్ట్ ను పెదవులకు అప్లై చేయాలి. దీని వల్ల పెదవులకు సహజమైన రంగు వస్తుంది.
- రోజూ పడుకునే ముందు ఆలివ్ నూనెతో పెదాలపై మసాజ్ చేసుకోవాలి. ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే పెదవులు ఆకర్షణీయంగా మారతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa