ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రష్యా దాడుల్లో 165 చిన్నారులు మృతి: ఉక్రెయిన్

international |  Suryaa Desk  | Published : Tue, Apr 05, 2022, 04:29 PM

ఉక్రెయిన్‌ను ఆక్రమించుకునే క్రమంలో రష్యా సేనల దురాగతాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. యుద్ధ నియమాలకు విరుద్ధంగా ఉక్రెయిన్ పౌరులపై దాడులకు రష్యా పాల్పడిందనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. కీవ్ నగర సరిహద్దులోని బుచా పట్టణంలో తీసిన ఓ వీడియోలో చిన్నారులు, పెద్దలు రోడ్లపైనే విగతజీవులుగా పడి ఉన్న వీడియో నెటిజన్లను కదిలించింది. అయితే తాము పౌరులపై దాడులు చేయలేదని రష్యా చెబుతోంది. దానిని ఖండిస్తూ, తమ దేశంలో 165 మంది చిన్నారులను రష్యా సైనికులు పొట్టనబెట్టుకున్నారని ఉక్రెయిన్ తాజాగా ప్రకటించింది. దీనిపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఫిర్యాదు చేయనున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేర్కొన్నారు. ఇక ఉక్రెయిన్‌లో చిన్నారులు, పౌరుల హత్యలపై అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాలు ఆగ్రహంతో ఉన్నాయి. మరిన్ని కఠిన ఆంక్షలను రష్యాపై విధించేందుకు సన్నద్ధం అవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa