ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కరెంట్ కోతలతో అల్లాడుతున్న ప్రజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 06:06 PM

ఏపీలో విద్యుత్ కోతలతో జనం అల్లాడుతున్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి లాంటి ప్రధాన నగరాలతో పాటు పల్లెల్లోనూ కరెంట్ కట్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో రోజుకు 6 గంటలకు పైగానే కోతలు విధిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉదయం 11 నుంచి రాత్రి వరకు విద్యుత్ ఉండట్లేదు. రాత్రి సమయాల్లోనూ ఇబ్బందులు తప్పట్లేదు. అసలే వేసవి కాలం ఆపై కరెంట్ లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa