కర్నాటక రాజధాని బెంగళూరు నగరంలో శుక్రవారం బాంబు కలకలం రేగింది. గుర్తు తెలియని దుండగులు నాలుగు పాఠశాలలకు బెదిరింపు మెయిల్ చేశారు. శక్తివంతమైన బాంబులు అమర్చినట్లు అందులో పేర్కొన్నారు. ''మీ స్కూల్‌లో శక్తిమంతమైన బాంబు పెట్టాం. ఇది జోక్ కాదు. ఆ బాంబు పేలితే చాలా మంది మరణిస్తారు’’ అని ఆ మెయిల్‌లో ఉంది. దీంతో వారు పోలీసులకు వెంటనే సమాచారమందించారు. అప్రమత్తమైన పోలీసులు పాఠశాలలన్నింటిలో తనిఖీలు ముమ్మరం చేశారు. నగరంలోని పాఠశాలల్లో పోలీసులు ఒక్కసారిగా చేపట్టిన తనిఖీలతో స్థానికులకు అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ బెదిరింపు ఎవరు పంపించారనే విషయంపై సైబర్ సెల్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు తనిఖీలలో పేలుడు పదార్థాలు లభించలేదని బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa