చిలకలూరపేట పట్టణంలోని ఎమ్మెల్యే విడుదల రజినికి మంత్రి పదవి దక్కడంతో కార్యకర్తలు, నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విడుదల రజిని ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనకు మంత్రి పదవి అనేది కలలో కూడా ఊహించలేదని, ఒక సాధారణ బిసి మహిళా గా ఉన్న నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి నన్ను గెలిపించి శాసనసభకు తీసుకెళ్లిన జగనన్నను మరువలేనని బిసిలు అంటే బ్యాక్ వార్ డ్ క్యాస్ట్ కాదు. బ్యాక్ బోన్ అని జగన్ నిరూపించారుఅన్నారు. బిసిలకు, మహిళలకు అండగా ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి ఉన్నారని, మంత్రి పదవి ఇవ్వటం సంతోషమని తనకు అవకాశం ఉన్నంత మేరకు కష్టపడతానని, నియోజకవర్గ రాష్ట్రఅభివృద్ధికి తోడ్పడతానని ఆమె చెప్పారు. వైసిపి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.