ఏపీలో కొత్త కేబినెట్ ఏర్పాటుతో అసంతృప్తి భగ్గుమంది.మంత్రి పదవులు దక్కని వారు ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తితో రగిలిపోతున్న మాజీ హోం మంత్రి సుచరిత..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఎంపీ మోపిదేవి చేసిన బుజ్జగింపులు పని చేయలేదు. స్పీకర్ ఫార్మాట్ లో సుచరిత రాజీనామా చేసినట్లు ఆమె అనుచరులు చెబుతున్నారు. కేబినెట్ బెర్త్ కోల్పోవడంతో కలత చెందిన ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఆమెను బుజ్జగించేందుకు ఆదివారం అర్థరాత్రి తన నివాసానికి వచ్చిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణకు రాజీనామా లేఖను అందజేశారు. సుచరిత అనుచరులు రమణ వాహనాన్ని అడ్డుకుని ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సైతం రాజీనామాకు సిద్ధమైయ్యారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం బుజ్జగింపులకు తలొగ్గలేదు.