వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం ధర్మారం వద్ద అగ్నిప్రమాదం జరిగింది. ప్రభుత్వ వస్త్ర (టెస్కో) గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. టెస్కో గోదాంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. 3 ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. భారీ మంటల వల్ల ఇప్పటికే గోదాం గోడలు కూలిపోయాయి. గోదాంలో సుమారు రూ.30 కోట్ల విలువైన వస్త్రాలు, సామగ్రి ఉన్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa