తిరుపతి నగర పరిధిలో తిరుపతి - కరకంబాడి మార్గంలో రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ మార్గంలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల వద్ద బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాహనాల ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రోడ్డు దాటుతున్న కారును మరొక్క కారు అతివేగంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa