--- 90 శాతం మంది టూత్ బ్రష్ పై పేస్ట్ వేసే ముందు గానీ, తర్వాత గానీ బ్రష్ ను నీటితో తడుపుతారట.
---హ్యూమన్ సలైవా లో ఓపిఆర్ఫిన్ అనే పెయిన్ కిల్లర్ ఉంటుంది. అది మోర్ఫిన్ కన్నా 6రేట్లు శక్తివంతమైనదట.
---ఇండియా కు సంబంధిచిన 'గో ఎయిర్' అనే ఎయిర్ లైన్స్ సంస్థ ఫ్లైట్ అటెండెంట్లుగా కేవలం ఆడవారిని మాత్రమే తీసుకుంటుంది. ఎందుకో తెలుసా ఆ సంస్థ విమానాలు చాలా తేలికగా ఉంటాయి. మగవారితో పోలిస్తే ఆడవారు బరువు తక్కువగా ఉంటారు కాబట్టి అలా చేయటం వల్ల సంవత్సరానికి ఆ సంస్థకు 5 లక్షల డాలర్ల విలువ చేసే పెట్రోల్ ఆదా అవుతుందట.
---ఏదైనా ఒక పనిని 21 రోజులు చేస్తే ఆ పని మనకు అలవాటుగా మారుతుందట. అదే పనిని 90 రోజులు చేస్తే అది మన లైఫ్ స్టైల్ గా మారిపోతుందట.
---క్రీస్తు పూర్వనికన్నా ముందు నుండి ఉన్న చెట్లు భూమ్మీద 14 ఉన్నాయట. అవి ఇప్పటికీ ఉండటం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa