రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాదారపు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మృతి చెందినట్లు బొమ్మూరు ఎస్సై జగన్ తెలిపారు. శ్రీరాంపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు కూరగాయలు కొనుక్కునే నిమిత్తం దివాన్ చెరువు వచ్చి రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని వెళ్లడంతో ఆయన మరణించినట్లు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.