వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత కల్పించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షపాతిగా నిలిచారని చిప్పగిరి జడ్పీటీసీ విరుపాక్షి అన్నారు. శుక్రవారం నివాస గృహంలో విలేకరులతో మాట్లాడుతూ రైతు సంక్షేమానికి, రైతుల అభివృద్ధికి ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.
పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జగన్ పాలనను స్వాగతిస్తూ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మంత్రివర్గంలో ఎస్సీ, బిసీ, మైనార్టీలకు 80 శాతం రిజర్వేషన్ కేటాయించి తన నిజాయితీని చాటుకున్నారని అన్నారు. మరో 20 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.