ముంబైలోని దాదర్ నుంచి పుదుచ్చేరి వెళ్తున్న క్రమంలో పుదుచ్చేరి ఎక్స్ప్రెస్కు ప్రమాదం ఎదురైంది. శుక్రవారం రాత్రి ముంబైలోని మాతుంగా-దాదర్ స్టేషన్ల మధ్య ఈ రైలు పట్టాలు తప్పింది. రైలులోని మూడు బోగీలు పట్టాల నుంచి తప్పుకున్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం ఏర్పడలేదు. రైల్వే అధికారులు, సిబ్బంది స్పందించి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. బోగీలను యథావిధిగా పట్టాలపై చేర్చేందుకు సమయం పడుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. దీంతో ఆ మార్గంలోని రైళ్ల రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది. సుమారు ఏడు రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని రైల్వే శాఖ ప్రకటించింది.