ఆదోని పట్టణం లోని శివారు తాయమ్మ బిలుకొండల్లో నాటుసారా స్థావరాలపై ఆదోని వన్‌టౌన్ స్పెషల్ పోలీసులు శుక్రవారం విస్తృత దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 2500 లీటర్ల బెల్లం ఊట, ఉపయోగించిన సామాగ్రిని ధ్వంసం చేసినట్లు సిఐ చంద్రశేఖర్ తెలిపారు. వాల్మీకి నగర్‌కు చెందిన బోయ మద్దిలేటి, రాజేశ్వరి నగర్‌కు చెందిన బోయ హనుమన్నలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. పట్టణంలో నాటుసారా, మద్యం, గుట్కా అక్రమ విక్రయాలు సాగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.