చాక్లెట్లపై ఆ బాలుడికి ఉన్న ఇష్టం అతడిని దేశ సరిహద్దులు దాటేలా చేసింది. చివరికి ఈ కారణంతో అతడు జైలు పాలవ్వాల్సి వచ్చింది. భారత్-బంగ్లాదేశ్‌కు సరిహద్దులో ఉండే షాల్డా నది సమీపంలోని ఓ గ్రామంలో బాలుడు ఇమాన్ హొసైన్ ఉండేవాడు. నదికి ఇవతల భారత్‌లో దొరికే చాక్లెట్లు అంటే అతడికి చాలా ఇష్టం. భారత్‌లోని త్రిపుర సిపాహీజలా జిల్లాలోని కలామ్‌చౌరా గ్రామానికి వచ్చేవాడు. తరచూ నది దాటుతూ ఆ చాక్లెట్లు కొనుక్కుని తినేవాడు. ఆ తర్వాత యధావిధిగా నది దాటి వారి గ్రామానికి వెళ్లిపోయాడు. ఇదే క్రమంలో ఈ నెల 13న నది దాటాక బీఎస్ఎఫ్ దళాల చేతికి చిక్కాడు. ఆ బాలుడిని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. 15 రోజుల రిమాండ్‌ను న్యాయమూర్తి విధించారు.