ప్రస్తుతం గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు అడుగు పెట్టాలంటేనే అందరూ బెంబేలెత్తుతున్నారు. ఈ తరుణంలో ఎండ వేడిని తట్టుకునేందుకు చాలా మంది ఫ్రిడ్జ్‌లోని నీటిని గటగటా తాగేస్తుంటారు. అయితే ఇది అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రిడ్జ్‌లోని కూలింగ్ వాటర్‌ను ఎక్కువగా తాగితే గొంతు ఇన్ఫెక్షన్లు, జీర్ణ సంబంధిత సమస్యలు, గ్యాస్ట్రిక్, ఉదర సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. దాహాన్ని తీర్చుకునేందుకు ఫ్రిడ్జ్ నీరు తాగితే శరీరంలో వేడి ఇంకా ఎక్కువవుతుందని చెబుతున్నారు. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు మజ్జిగ, కొబ్బరి బొండాలు తాగాలని, తద్వారా శరీరానికి అవసరమైన ఖనిజాలు లభిస్తాయని సూచిస్తున్నారు.