ఐపీఎల్ 2022 లో భాగంగా శనివారం రోజున రాత్రి 7:30 గంటలకు ఢిల్లీ - బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఇటు రెండు జట్లు ఆర్సీబీ ఐదు మ్యాచ్ లు ఆడి మూడు గెలిచి రెండు ఒడిపో యి 6వ స్థానం లో ఉండగా ఢిల్లీ నాలుగు మ్యాచ్ లు ఆడి రెండు ఓటమి రెండు గెలిచి 8వ స్థానం లో ఉంది. ఈ సందర్బంగా శనివారం జరగబోయే మ్యాచ్ లో ఢిల్లీ స్టార్ ఆల్ రౌండ ర్ మిచెల్ మార్ష్ అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయ్. ఐపీల్ వేలం లో 6.50 కోట్లకు మార్ష్ ను ఢిల్లీ సొంతం చేసుకుంది. రోవమన్ పావెల్ స్థానంలో మార్ష్ ఒరిలోకి దిగే అవకా శాలు ఉన్నాయ్. లేదా పావెల్ ని కొనసాగించి ఒక్క విదేశీ బౌలర్ తో కూడా ఆడే అవకాశాలు లేకపోలేదు.ఇటు మార్ష్ చేరికతో ఢిల్లీ బలం మరింత పెరిగింది.గతంలో సన్ రైజర్స్ తర పున ఆడిన మార్ష్ నేడు ఢిల్లీ తరుపున అరంగేట్రం చేయనున్నాడు. హార్డ్ హిట్టింగ్ తో మ్యాచ్ స్వరూపానే మార్చేయగల మార్ష్ రాకతో ఢిల్లీ ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నారు.