కాంగ్రెస్ పార్టీ తొలి డిజిటల్ మెంబర్ షిప్ ను ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తీసుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మొదలైన పార్టీ డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్ ముగిసింది. ఈ డ్రైవ్ ముగిసే రోజున పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ డిజిటల్ సభ్యత్వం తీసుకున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ సాగుతున్న కాంగ్రెస్ పార్టీ.. తాజాగా డిజిటల్ యుగంలో డిజిటల్ సభ్యత్వాలను మొదలుపెట్టింది.
ఈ క్రమంలోనే పార్టీలో కొన్ని రోజులుగా డిజిటల్ సభ్యత్వాల నమోదు జోరుగా సాగగా... శుక్రవారంతో ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసింది. సభ్యత్వ నమోదు ముగిసే చివరి రోజున సోనియా గాంధీ డిజిటల్ సభ్యత్వం తీసుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా సోనియాకు ఇచ్చిన డిజిటల్ మెంబర్ షిప్ గుర్తింపు కార్డును కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.