అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవంపై స్పష్టత వచ్చింది. అయోధ్యలో భవ్య రామమందిరం 2024 జనవరి రెండోవారం నాటికి నిర్మాణం పూర్తవుతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని రామ జన్మభూమి మందిర్ తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ వెల్లడించారు. ఢిల్లీలో ఆయోధ్య పర్వ్ కార్యక్రమంలో భాగంగా శనివారం మాట్లాడారు. 2024లో మకర సంక్రాంతి రోజున రామాలయాన్ని ప్రారంభించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఆగస్టు నుంచి మందిర నిర్మాణ పనులను మరింత వేగవంతం చేస్తామన్నారు. రాళ్లను చెక్కే పని ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు.