పుట్లూరు మండలం తక్కళ్లపల్లి గ్రామంలో వెలసిన పెద్దమ్మ తల్లికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు కుసుమ ఓబయ్య దంపతులు పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ. అమ్మవారి మూలవిరాట్ ను ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు తీర్చుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్థులు, బంధువులు పాల్గొన్నారు.