కర్ణాటక రాష్ట్రంలోని రాయ్‌చూర్ లో విషాదం చోటుచేసుకుంది. భర్త చనిపోయాడన్న బాధతో ఓ మహిళ తన 6 నెలల కుమారుడిని చంపి, ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శనివారం రాత్రి 10 గంటలకు జరిగింది. గంగాధర్ బి కమ్మర(36), శ్రుతి(30) భార్యాభర్తలు. వీరికి 6 నెలల కుమారుడు అభిరామ్ ఉన్నాడు. మంగళూరులోని అగ్నిమాపక దళంలో గంగాధర్ డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. రాయ్‌చూర్ లో గంగాధర్ కుటుంబం నివాసం ఉంటోంది.
శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గంగాధర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం రాయచూర్ లో ఉన్న అతని భార్యకు తెలిసింది. భర్త మరణ వార్త విని ఆమె తట్టుకోలేకపోయింది. శనివారం రాత్రి 10 గంటల సమయంలో తన కొడుకును హత్యచేసి, తాను ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. మంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.