ఏపీలోని ఏలూరు జిల్లాలో కూతురిని వేధించాడని ఆమె తండ్రి, సోదరులు పాశవికంగా దాడి చేశాడు. యువకుడిని చీకటిలో బంధించి, మర్మాయవాలపై కొట్టాడు. దీంతో బాధితుడి పరిస్థితి విషమించింది. నాలుగు రోజుల క్రితమే ఈ ఘటన జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతడి పరిస్థితిని గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం నరసింహారావుపాలెంలో ఈ ఘటన జరిగింది. కొన్నాళ్లుగా యువతిని ప్రేమ పేరుతో వేధించిన ఆ యువకుడు తన కుమార్తెతో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పెట్టాడని యువతి తండ్రి కోపం పెంచుకున్నాడు. పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినా, ఆ యువకుడిపై యువతి సోదరులు దాడి చేశారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో యువతి తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa