చిత్తూరు: ఏర్పేడు ముందు సీతారాం పేట దగ్గర సోమవారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి నుండి వస్తున్న కారు ఓవర్ టేక్ చెయ్యబోయి ఎదురుగా వస్తున్న లారీని అతివేగంతో ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారులోని ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ కారులోనే ఇరుక్కోవడంతో స్థానికులు డ్రైవర్ని బయటకు తీశారు. వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa