విశాఖ రైల్వే కోర్టకు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఓ కేసు విషయంలో హాజరయ్యారు. 2018-19 మధ్య చలో ఢిల్లీ యాత్ర పేరిట కొణతాల ఓ ఉద్యమాన్ని నడిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొణతాలపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ విశాఖలోని రైల్వే కోర్టులో సాగుతోంది. ఈ కేసు విచారణ కోసం సోమవారం నాడు మాజీ మంత్రి స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 4కు వాయిదా వేయడంతో కొణతాల కోర్టు నుంచి వెళ్లిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa