విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణుని డెమోక్రటిక్ నాయకులు సోమవారం ఆంధ్రప్రభకాలనీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 24న హోటల్ ఐలాపురంలో జరగనున్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అభినందన సభకు విశిష్ఠ అతిథిగా విచ్చేయాలని కోరారు. ఈ సందర్భంగా దుశ్శాలువతో సత్కరించి ఆహ్వానపత్రికను అందజేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో డెమోక్రటిక్ రాష్ట్ర అధ్యక్షులు డి. శ్రీనివాస్, గుంటూరు జిల్లా అధ్యక్షులు జ్ఞానేశ్వరరావు, నాయకులు ఆనంద్ రావు, బాల సుందర్, అబ్రహాం లింకన్ తదితరులు ఉన్నారు.