అమెరికాలో చదువుకునేందుకు వెళ్లాలనుకునే విద్యార్థులకు అగ్రరాజ్యం గుడ్ న్యూస్ అందించింది. స్టూడెంట్ వీసాల సంఖ్యను భారీగా పెంచింది. దీంతో వీసాల కోసం వేచి ఉండే సమయం కూడా తగ్గనుంది. అయితే పర్యాటక వీసాల కోసం నిరీక్షించే వారికి కొంత కాలం ఎదురు చూపులు తప్పవు. వీసా స్లాట్ల కోసం ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మూడేళ్ల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ దృష్టికి వెళ్లడంతో అధికారులు స్పందించారు. వీసా స్లాట్ల కోసం వేచి ఉండే సమయాన్ని 911 రోజుల నుంచి ఒక్కసారిగా 68 రోజులకు తగ్గిస్తూ అమెరికా కాన్సులేట్ అధికారులు సోమవారం నిర్ణయం తీసుకున్నారు. దీంతో విద్యార్థుల్లో సంతోషం నెలకొంది.