రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. 52 రోజులైనా ఉక్రెయిన్ హస్తగతం కాకపోవడంతో రష్యా దాడులను తీవ్రం చేసింది. కనిపించిన ఉక్రెయిన్ సైనికులను నిర్ధాక్షిణ్యంగా కాల్చి వేస్తుంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఓ ఉక్రెయిన్ సైనికుడి ప్రాణాలను అతడి స్మార్ట్ ఫోన్ నిలిపింది. రష్యా దళాలను కొందరు ఉక్రెయిన్ సైనికులు నిలువరిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఉక్రేనియన్ సైనికుడిని రష్యన్ దళాలు కాల్చాయి. ప్రాణం పోయిందని ఆ సైనికుడు అనుకున్నాడు. అయితే జేబులో పెట్టుకున్న ఫోన్ కారణంగా బుల్లెట్ అతడి శరీరంలోకి పోలేదు. 7.62 మి.మీ. బుల్లెట్‌ను అతడి ఫోన్ అడ్డుకుంది. ఉక్రేనియన్ సైనికుడు వైరల్ వీడియోలో ఇరుక్కుపోయిన బుల్లెట్‌తో దెబ్బతిన్న తన ఫోన్‌ను చూపిస్తూ, స్మార్ట్‌ఫోన్ తన ప్రాణాన్ని కాపాడిందని చెప్పడం నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది.