హైదరాబాద్ లోని దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా సభ ఆధ్వర్యంలో నిర్వహించే వృత్తి విద్యా కోర్సులకు అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ అధికారులు నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేటలో బుధవారం కోరారు. కనీసం పదవ తరగతి ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులు ఈ కోర్సులు చేయడానికి అర్హులని తెలిపారు. ఈ కోర్సులు పూర్తి చేసిన తర్వాత స్వయం ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం, 8008742542 నెంబర్ లో సంప్రదించాలని దుర్గాబాయి దేశముఖ్ మహిళా సభ చైర్ పర్సన్ శారద కోరారు.