అరుణాచల్ ప్రదేశ్ లోని అప్పర్ సియాంగ్ జిల్లాలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. యింగ్‌కియాంగ్‌లోని మార్కెట్ ఏరియాలో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో 30కి పైగా ఇళ్లు, దుకాణాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సుమారు 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. మ.2 గంటలకు ప్రమాదం జరగగా సా.6 గంటల సమయంలో మంటలు అదుపులోకి వచ్చినట్లు అప్పర్ సియాంగ్ డిప్యూటీ ఎస్పీ ఓపిర్ పారాన్ తెలిపారు. ఈ ప్రమాదంతో సుమారు రూ.5 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa