కొందరికి నోటి పూత సమస్య వేధిస్తూ ఉంటుంది. నోట్లో నాలుకతో పాటు పెదవుల లోపలి భాగంలో పొక్కులు వస్తుంటాయి. దీంతో కొంచెం కారం తగిలినా తట్టుకోలేరు. అయితే కొన్ని సహజ సిద్ధమైన చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- నోటి పూత, పొక్కులతో బాధపడేవారు కొంత నెయ్యిని తీసుకొని అవి ఉన్న చోట రాయాలి. అలా చేస్తే సమస్య తగ్గుతుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
- బియ్యాని కడిగిన నీటిలో కొంచెం కలకండ్ కలిపి రోజులో చిన్న గ్లాసు తీసుకుంటే నోటి పూత సమస్య తగ్గుతుంది.
- పటిక బెల్లం కూడా నోటి పూత సమస్యను తగ్గిస్తుంది. ఇందుకోసం కొంత పటిక బెల్లాన్ని తీసుకొని నీటిలో కలిపి పల్చని ద్రావణంలా తయారు చేయాలి. అనంతరం దానిని నోట్లో పోసుకొని అలాగే కొద్ది సేపు ఉంచుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
- కొత్తిమీరను ముద్దగా నూరి దాన్ని ఒక గ్లాస్ నీటిలో కలిపి కషాయంలా తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని నోట్లో పోసుకొని బాగా పుకిలించాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే నోటిపూత సమస్యకు చెక్ పెట్టవచ్చు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
- నోటిపూత సమస్యతో బాధపడుతున్న వారు కొంత కాలం పాటు సులభంగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. నెయ్యి, ఆకుకూరలు, పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఈ సమయంలో మాంసాహారాన్ని తగ్గిస్తూ కారం, పులుపు, ఉప్పులను కొన్ని రోజులు తక్కువగా తినాలి. లేదా పూర్తిగా మానేయాలి.
- ఆహారం తీసుకున్న తర్వాత కచ్చితంగా నోటిని శుభ్రం చేసుకోవాలి. భోజనం చేసిన తర్వాత తమలపాకులను నేరుగా నమిలి తినాలి. ఇలా చేస్తే నోటిపూత తగ్గుతుంది.