తన మిత్ర దేశమైన చైనాకు పాకిస్థాన్ షాకిచ్చింది. చైనా – పాక్ ఆర్థిక కారిడార్(సీపీఈసీ) అథారిటీ రద్దు చేస్తూ పాక్ నూతన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.పాక్ నూతన ప్రధాని షెహబాబ్ షరీఫ్ ఆదేశాల మేరకు ప్రణాళికా మంత్రి అషన్ ఇఖ్బాల్ ఈ ప్రాజెక్టులను వనరులను వృథా చేసే అనవసరమైన సంస్థగా ఆదేశాల్లో పేర్కొన్నారు.చైనాలోని షిన్ జియాంగ్ ప్రావిన్స్ నుంచి పాక్‌లోని బలూచిస్థాన్ పరిధిలో గల గదర్ ఓడరేవు మధ్య మౌలిక వసతులు, ఇంధన ప్రాజెక్టు ఏర్పాటు కోసం 2019లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ సంస్థను ఏర్పాటు చేశారు. దాదాపు రూ. 4.5 లక్షల కోట్ల మేర ప్రాజెక్టులనుద్దేశించి అథారిటీని నియమించారు. అయితే ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం సగానికి పైగా ఖర్చు చేశామనని చైనా వాపోతోంది. పాక్ నిర్ణయంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు పనులు సగంకుపైగా పూర్తయిన నేపథ్యంలో పాక్ నూతన ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఏమిటని చైనా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.