ఈ రోజు డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఒంగోలుకు రావడం సంతోషంగా ఉంది, పాదయాత్ర, మేనిఫెస్టోలో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన మాటను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. పావలా వడ్డీని ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్‌కు దక్కింది. తర్వాత వచ్చిన చంద్రబాబు ఎన్నో ఆశలు పెట్టి డ్వాక్రా మహిళలను మోసం చేశారని ధ్వజమెత్తారు. సీఎం వైయస్ జగన్ ఇప్పటికే మేనిఫెస్టోలోని 90 శాతంపైగా హామీలను నెరవేర్చారని తెలిపారు. మూడో విడత వైయస్సార్ సున్నా వడ్డీ విడుదల కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు.