ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ విద్యార్ది సమాధానం వైరల్ గా మారింది. ఓ పరీక్షలో ఎమ్మెల్యే ఎన్నికలు ఎలా జరుగుతాయి అనే ప్రశ్నను ఇచ్చారు. దానికి విద్యార్ధి రాసిన సమాధానం ఇలా ఉంది.
“ఎమ్మెల్యే ఇంటి ఇంటికి వచ్చి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోమని ప్రచారం చేస్తాడు. 18 సంవత్సరాలు ఉన్న వారికి ఓటు హక్కు ఉంటుంది. వాళ్లకి పైసలు, బిర్యానీలు,మందు బాటిళ్లు ఇస్తారు. ఆడవారికి చీరలు ఇస్తారు. ఎన్నికలలో ప్రజలు ఎన్నుకుంటారు. ప్రభుత్వం ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయో లెక్కబెట్టి, ఓట్లు ఎక్కువ వచ్చిన వారిని గెలిచినట్టు ప్రకటిస్తారు.” అని విద్యార్ధి సమాధానం రాశాడు.
ఈ సమాధానం ఉన్న ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వాస్తవాన్ని విద్యార్ధి రాశాడని, మన రాజకీయాలు ఎంతలా దిగజారాయో అర్దమవుతుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఆ విద్యార్దిని అంతా మెచ్చుకుంటున్నారు.