దేశంలోని డ్రోన్ సర్వీస్ రంగంలో అద్భుత అవకాశాలు ఉన్నాయని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. 'రాబోయే నాలుగైదేళ్లలో ఈ రంగంలో లక్ష ఉద్యోగాలు వస్తాయి. డ్రోన్ల తయారీ రంగాన్ని విస్తరించేందుకు రూ.5వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. డ్రోన్ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందిస్తాం' అని పేర్కొన్నారు.