కర్ణాటకలో PUC రెండో ఏడాది పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉడుపిలో హిజాబ్ ధరించి హాజరైన ఇద్దరు విద్యార్థినులను అధికారులు పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. ఇన్విజిలేటర్, కళాశాల ప్రిన్సిపల్‌ను చాలాసేపు విద్యార్థినులు ఒప్పించే ప్రయత్నం చేశారు. కోర్టు ఆదేశాలు ఉన్నందున హిజాబ్‌తో అనుమతించలేమని వారు స్పష్టం చేశారు. ఈ ఏడాది జనవరిలో ఉడుపి కాలేజీలో మొదలైన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన విషయం తెలిసిందే.