తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని సీఎం జగన్ ఒంగోలు సభలో చెప్పారు. నేరుగా ప్రజల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తే ఏపీ శ్రీలంకగా ఎందుకు మారుతుందో విమర్శిస్తున్న ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల సొమ్మును జేబుల్లో వేసుకుంటే అమెరికా అవుతుందా అని ప్రశ్నించిన ఆయన.. ప్రజలు బాగుపడితేనే రాష్ట్రం బాగుంటుందన్నారు.