సాధారణంగా వయసు మీద పడే కొద్దీ ముఖం పై ముడతలు వస్తూ ఉంటాయి. చర్మం సాగిపోయి ముఖంపై ముడతలు వస్తుంటాయి. ముడతలు వచ్చిన ముఖంలో కాంతి తగ్గుతుంది. పట్టు కోల్పోయిన చర్మం అందాన్ని కూడా కోల్పోతుంది. కొన్ని చిట్కాలతో ముఖంపై ముడతలను తొలగించొచ్చు. అవేంటో చూద్దామా...
-- ఒక కప్పులో ఉడకబెట్టిన బంగాళాదుంప గుజ్జు, 2స్పూన్ ల ఓట్స్ పొడి, 2 స్పూన్ ల పాలు, కొంచెం తేనె, కొన్ని చుక్కల ఆలివ్ నూనెను అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఒక 20 నిమిషాలు ఉంచుకొని ఇక ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చెయ్యడం వల్ల చర్మం మృదువుగా మారి చాలా అందంగా కనిపిస్తుంది.
--ఒక కప్పు బొప్పాయి గుజ్జులో, కొద్దిగా బియ్యపు పిండిని వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఒక అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముఖంపై ముడతలు ఈజీగా తగ్గి చర్మం బిగుతుగా తయారవుతుంది.