పట్టపగలే ఇసుక తరలిస్తున్నారు. ఇసుక మాఫియా అడ్డాగా పిట్టలవానిపాలెం మండల కేంద్రం మారిందని ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదని బహిరంగంగానే విమర్శలు వస్తున్నాయి.
పిట్టలవానిపాలెం మండలంలో ఇసుకాసురులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ అండదండలు మాకు పుష్కలంగా ఉన్నాయి
అంటూ ఏ అధికారి మమ్మల్ని ఎదుర్కోలేరు అంటూ ఎక్కడ అందాల్సిన మామూలు అక్కడ ముట్ట చెప్తున్న అమౌంటు బహిరంగంగా బాహాటంగా చెబుతున్నారు.
గ్రామ సచివాలయాలు పంచాయతీ ఆదాయానికి గండి కొడుతూ అక్రమంగా సొమ్ముచేసుకుంటూ పుడమి తల్లికి కోత పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు కళ్లు మూసుకొని ఇవేవి మాకు తెలియదన్నట్లు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం అధికారుల తీరుకు అద్దం పడుతుందని మండల ప్రజలు విమర్శిస్తున్నారు.