బాపట్ల జిల్లాలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం మూడో విడత 3, 51, 67 స్వయం సహాయక సంఘాలకు రూ 46. 6 కోట్లు విడుదల చేసినట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలంటే ఆర్థిక స్వావలంబన అవసరమన్నారు. ఈ విషయం మహిళలను రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తోందని చెప్పారు. ఈ మొత్తాన్ని స్వయం సహాయక సంఘాల వాళ్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎంపీ నందిగామ సురేష్ తదితరులు పాల్గొన్నారు.