అరబ్ దేశాలంటే విలావంతమైన జీవితం గడిపే సంపన్నులు గుర్తుకు వస్తారు. బంగారంతో చేసిన కార్లను అక్కడి ప్రజలు వినియోగిస్తుంటారు. ఆఖరికి పెట్రోలింగ్ చేసే పోలీసులు కూడా కోట్ల విలువ చేసే లంబోర్గిని, బుగాట్టీ కార్లలో గస్తీ నిర్వహిస్తారు. అలాంటి దుబాయ్‌లో నంబర్ ప్లేట్ కోసం ఓ వ్యక్తి వేలంలో ఏకంగా రూ.70 కోట్లు వెచ్చించాడు. దీనిపై అందరూ అవాక్కవుతున్నారు. అయితే అంత మొత్తం పెట్టి దానిని కొనడం వెనుక ఓ సామాజిక సాయం చేసే దృక్పథం కూడా ఉంది. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
దుబాయ్‌లో AA8 సింగిల్ డిజిట్ నెంబర్ ఉన్న నంబర్ ప్లేట్‌కు వేలం పెట్టారు. ఇది 35 మిలియన్ల దిర్హమ్‌లకు అమ్ముడుపోయింది. అంటే మన భారతీయ కరెన్సీలో అక్షరాలా రూ.70 కోట్లు. ఇది నంబర్ ప్లేట్ల వేలంలో మూడవ అత్యధికం. గత ఏడాది AA9 నంబర్ ప్లేట్‌ను రూ.79 కోట్లకు అమ్ముడుపోయింది. తాజా AA8 సింగిల్ డిజిట్ నెంబర్ ప్లేట్‌ను వేలం వేయడానికి ఓ కారణం ఉంది. వన్ బిలియన్ మీల్స్ సంస్థ కోసం ఈ వేలం నిర్వహించారు. వచ్చిన డబ్బుతో 50 దేశాల్లో నిరుపేదలకు ఆహారం అందించనున్నారు.