ఎట్టకేలకు ఎంపీడీవోల సీనియారిటీ జాబితా సిద్ధమైంది. ఉద్యోగోన్నతుల కోసం నిరీక్షించిన వారికి త్వరలో ఉద్యోగోన్నతి కల్పిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఉత్వర్వులు జారీ చేయనుంది. ఉమ్మడి జిల్లాలో 65 మండలాలు ఉండగా అందులో 27 మండలాల్లో ఇన్‌ఛార్జులు కొనసాగుతున్నారు. ఉద్యోగోన్నతి పొందే ఎంపీడీవోల్లో. భాగ్యలక్ష్మి, ఉమావాణి, రాధమ్మ, శ్రీలక్ష్మి, పార్వతమ్మ, రాజశేఖరరెడ్డి, శ్రీనివాసప్రసాద్, రవికుమార్‌నాయుడు, వెంకటరమణ, చిన్నరెడ్డప్ప, రవికుమార్, శ్రీనివాసులు, లక్ష్మీపతి, గంగాభవాని, నరసింహమూర్తి, సుశీలాదేవి, ఆదిశేషారెడ్డి, శోభన్‌బాబు, వెంకటరత్నం, విద్యారమ, మల్లికార్జున, ఇందిరమ్మ ఉన్నారు. వీరితో పాటు వేర్వేరు శాఖల్లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ప్రశాంతి, జ్యోతి, నాగపద్మజకు ఉద్యోగోన్నతి లభించనుంది. వీరు ఉద్యోగోన్నతి ద్వారా డీపీవో, డీఎల్‌డీవో, డ్వామా, డీఆర్‌డీఏ శాఖల్లో పీడీలు, అడిషనల్ పీడీలు, జడ్పీ డిప్యూటీ సీఈవో పోస్టుల్లో నియమితులు కానున్నారు.
ఉద్యోగోన్నతి కోసం నిరీక్షించిన ఎంపీడీవోలకు వైకాపా ప్రభుత్వం ఆ అవకాశం కల్పించడం సంతోషకరమని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు అన్నారు. స్థానిక జడ్పీ కార్యాలయంలో ఛైర్మన్‌ను పలువురు ఎంపీడీవోలు శుక్రవారం కలిసి సత్కరించి పలు అంశాలపై చర్చించారు. ఛైర్మన్ మాట్లాడుతూ ఎంపీడీవోల ఉద్యోగోన్నతి సమస్యను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్ఢి. సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారన్నారు.