కృష్ణా జిల్లాలోని రెండవ శక్తి పీఠంగా విరాజిల్లుతున్న గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేం చేసియున్న శ్రీ కొండలమ్మ ఆలయంలో అమ్మవారికి వేకువజాము నుంచే విశేష పూజలు ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చన శాక్తంగా ఆలయ పండితులు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. అలాగే మండల కేంద్రమైన గుడ్లవల్లేరు గ్రామంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాతన క్షేత్రంలో శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచి అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భక్తులు తరలి వచ్చారు.
అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసా దాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. శ్రీ కొండలమ్మ అమ్మవారి ని భక్తులు తొలుత గర్భాలయంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అలివేటి మండపంలోని అమ్మవారికి దర్శించుకున్నారు. వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ పాలకమండలి ఛైర్మన్ కనుమూరి రామి రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవోకానూరి సురేష్ బాబు, పాలకమండలి సభ్యులు ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.