కృష్ణా జిల్లా: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం వేగవంతం కావడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. వివాదాలు, కోర్టు కేసుల్లో ఉన్న లేఅవుట్లలో స్థలాలు పొందిన లబ్ధిదారులకు ఇబ్బందుల్లేకుండా ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తిం చాలని ఇటీవల సీఎం వైఎస్ జగన్మో హన్ రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ప్రత్యామ్నాయ లేఅవుట్ల కోసం స్థలాల అన్వేషణలో నిమగ్నమ య్యారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 12 లేఅవుట్లు కోర్టు వివాదాల్లో ఉన్నాయి. ఘంటసాల మండలం దేవర కోట, గూడూరు మండలం ఇరుగులపల్లి, కప్పల దొడ్డి, రామరాజుపాలెం, కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెం, పామర్రు మండలం పామర్రు, తోట్లవల్లూరు మండలం, తోట్లవల్లూరుల్లో లేత వుట్లు వివాదాల్లో ఉన్నట్టు గుర్తించారు. వాటి పరి ధిలో 1, 207 ఇళ్ల స్థలాలున్నాయి.
వీటిలో పామర్రు లేఅవుట్లో అత్యధికంగా 636 స్థలాలు, తోట్లవల్లూ రులో 234 స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయా గ్రామాల్లోని లేఅవుట్లకు ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేయాల్సి ఉంది. సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలతో సంబంధిత రెవెన్యూ అధికారులు వారి గ్రామాలకు సమీపంలోనే ప్రత్యామ్నాయ స్థలాలను అన్వేషిస్తున్నారు. త్వరలోనే వీటి ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. వసతులకు రూ. 827 కోట్లతో ప్రతిపాదనలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ. 327 కోట్లు అవ సరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదిం చారు.
కృష్ణా జిల్లాకు రూ. 159 కోట్లు, ఎన్టీఆర్ జిల్లాకు రూ. 168 కోట్లు మంజూరు కోరుతూ నివేదికలు పంపించారు. ఈ నిధులతో ఆయా కాలనీల్లో లెవెలింగ్, అప్రోచ్ రోడ్లు, మంచి నీటి సరఫరా, కల్వర్టులు, వంతెనల నిర్మాణం వంటి పనులు చేపడ్డారు. ఊపందుకుంటున్న నిర్మాణాలు మరోవైపు జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలు ఊపం దుకుంటున్నాయి. కృష్ణా జిల్లాకు 1, 01, 388ఎన్టీఆర్ జిల్లాకు 82, 430 కాలనీ ఇళ్లు మంజూర య్యాయి. వీటిలో కృష్ణాలో 74, 771 ఇళ్లకు శంకుస్లా పనలు పూర్తయ్యాయి. 11, 110 ఇళ్లు పునాదుల స్థాయికి పైన, 3, 450 ఇళ్లు స్లాబులు పూర్తి చేసుకు న్నాయి.
ఈ జిల్లాలో ఇప్పటివరకు ఇళ్ల నిర్మాణానికి వీలుగా లబ్దిదారులకు రూ. 100. 48 కోట్లు చెల్లిం చారు. ఒక్కొక్కరికి రూ. 35 వేల చొప్పున 10, 604 మందికి బ్యాంకు రుణాలు కింద చెల్లింపులు జరి పారు. ఎన్టీఆర్ జిల్లాలో 57, 224 ఇళ్లకు శంకుస్థాప నలు జరగ్గా, మూడు వేల ఇళ్లకు పైగా స్లాట్లు పూర్తయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలో జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి లబ్దిదారులకు రూ. 76 కోట్లు చెల్లిం చారు. రూ. 35 వేల చొప్పున బ్యాంకు రుణంగా 12 వేల మందికి అందజేశారు. జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంటు, స్టీలు, ఇసుకను అందుబాటులో ఉంచారు.